* మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి
* ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు ఆదేశం
* ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్ లాగా నిర్ణయం ఉండకూడదు
* పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పై సీజే జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పు
ఆకేరు న్యూస్ – డెస్క్ : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలవరించింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. భారత రాష్ట్ర సమితి కి చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ తెల్లం వెంకట్రావ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఫార్టీ ఫిరాయించినట్లయిందని న్యాయ స్థానంలో పిటీషన్ దాఖలైంది. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అదే విదంగా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీ రామారావు తో పాటు మరో 7 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ అరికేపూడి గాంధి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి లు పార్టీ ఫిరాయించారని సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి సైతం ఇదే విషయంపై స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. విచారించిన సుప్రీం కోర్టు సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించింది.
* మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేలు విచారణ ప్రక్రియను పొడిగించేందుకు ప్రయత్నిస్తే ప్రతి కూల నిర్ణయం తీసుకోవాలి. సంవత్సరాల తరబడి నిర్ణయం తీసుకోకుండా ఉండడం సరియైంది కాదు. ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్ అన్న విదంగా నడుచుకోవడం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సుప్రీం కోర్డు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు చెప్పింది.
—————————-
