
* కొద్ది రోజులుగా అలజడి.. ప్రశాంతం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కొన్ని రోజులుగా హైదరాబాద్ వాసులనుభయపెడుతున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. మంచిరేవులలోని ఎకో టెక్ పార్కులో ఏర్పాటు చేసిన బోన్ లో చిరుత పడినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రేహౌండ్స్ ప్రాంతంలో చిరుత కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు స్థానికంగా ఎనిమిది ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే పరిసర ప్రాంతాల్లో నాలుగు బోనులను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకున్నారు. ఈ చిరుతను జూపార్కుకు తరలించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మందిలో ఆందోళన వ్యక్తమైంది. రంగారెడ్డి నుంచి మెల్లిగా బయటకు వచ్చిన చిరుత ప్రయాణం సోమవారం తెల్లవారుజామున రాందేవ్ గూడాలోని మిలటరీ ఏరియాలో రోడ్డు దాటిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అక్కడ శిక్షణ కేంద్రంలోకి ఈ చిరుత ప్రవేశించింది. ఇప్పుడు తాజాగా ఎకో టెక్ పార్కులో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
…………………………………