
* బీజేపీ వేసిన కేసు కొట్టివేత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanthreddy)కి హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో ఆయనపై నమోదైన కేసును ధర్మాసనం కొట్టేసింది. రేవంత్ రెడ్డి ప్రసంగం వల్ల బీజేపీ (BJP)పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతంలో కేసు వేశారు. గతేడాది మే4న కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగంపై ఆయన ఫిర్యాదు చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆయన సభలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అనవసర ఆరోపణలు చేశారని, దాని వల్ల పార్టీ పరువుకు భంగం ఆధారాలు లేకుండా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతున్న ఆ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టు(Highcourt)లో పిటిషన్ వేశారు. రేవంత్ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆ కేసును కొట్టి వేసింది.
………………………………………….