
* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్ హనుమకొండ : ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.హనుమకొండలోని ఆయన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్ కు గాని ఆయన కుటుంబానికి గాని లేదని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని కడియం అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అన్నారు.అసెంబ్లీలో కేసీఆర్ కు తగినంత బలం ఉన్నా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ ఎస్ లో విలీనం చేసుకోలేదా అని కడియం ప్రశ్నించారు. పది స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ కలలు కంటున్నారని ఉప ఎన్నికలను నిర్ణయించేది ఎలక్షన్ కమిషన్ అని కేసీఆర్ కాదు అని కడియం ఎద్దేవా చేశారు.
……………………………………..