
* అనిల్ అంబానీ ఈనెల 5న విచారణకు రావాలని ఆదేశం
ఆకేరు న్యూస్, డెస్క్ : అపర కుబేరుడు, రిలయన్స్ గ్రూప్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీకి రుణాల ఎగవేత కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 5న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా అంబానీకి కూడా నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అనిల్ అంబానీ (Anil Ambani ) రూ.10 వేల కోట్ల రుణాలను దారి మళ్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2017-19 మధ్య ఎస్ బ్యాంకు నుంచి రూ.3 వేల కోట్లను అంబానీ సేకరించారు. గతనెల 24న అంబానీకి సంబంధించిన కంపెనీలు, వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ ఏజెన్సీ మనీలాండరింగ్ (MoneyLandaring) దర్యాప్తును నిర్వహిస్తోంది. దర్యాప్తులో భాగంగా, ED గత వారం ముంబైలోని అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌తో సంబంధం ఉన్న 35 ప్రదేశాలను సోదా చేసింది. ఈ సోదాల్లో దాదాపు 50 కంపెనీలు మరియు 25 మంది వ్యక్తులు ఉన్నారు. నకిలీ బ్యాంక్ గ్యారెంటీ కేసులో ఒడిశా, కోల్‌కతాలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ నకిలీ బ్యాంక్ గ్యారెంటీ ఆధారంగా అనిల్ అంబానీ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని ఈడీ ఆరోపించింది. అనిల్ అంబానీ సంస్థ ద్వారా సంస్థలకు కమిషన్ కోసం నకిలీ బిల్లులు కూడా సృష్టించారని, అనేక గుప్త బ్యాంకు ఖాతాలు వెలుగులోకి వచ్చాయని, ఆయా ఖాతాల్లో కోట్లాది రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని ఈడీ అంబానీకి నోటీసులు జారీ చేసింది.
……………………………………………….