
* ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు
ఆకేరు న్యూస్, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజ్యాంగం పట్ల కాని వారు చేసిన చట్టాల పై కాని నమ్మకం లేదని ఎమ్మెల్సీ తక్కళ్ల పల్లి రవీందర్ రావు ( THAKKALLAPALLY RAVINDER RAO ) విమర్శించారు.ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ ( RAJIV GANDHI)అని రవీందర్ రావు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.1985లో రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడు వన్ ధర్ఢ్ మెజారిటీ ఉంటే విలీనం కావచ్చని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టాన్ని తెచ్చారు.ఈ చట్టాన్ని తీసుకొచ్చిందే మీ పార్టీ కాదా అని రవీందర్ రావు ప్రశ్నించారు.2003లో రాజీవ్ చేసిన చట్టంలో లోపాలు ఉన్నాయని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సవరణ చేశారని తెలిపారు. ఎన్నికల మందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒక సారి గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు.మార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని అనలేదా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ది ఉందా అని రవీందర్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లకు దక్కుతున్న గౌరవం ఏంటో ఒకసారి తెలుసుకోవాలని సూచించారు. 91 వ రాజ్యాంగ సవరణ చేశారు. ఈ రోజు మరో సమస్య వచ్చిందని రవీందర్ రావు అన్నారు. పార్టీ మారిన వారిపై స్పీకర్ చర్య తీసుకుంటారని చర్చ జరుగుతోంది. 2023 ఎన్నికలకల్లో గెలుపొందిన 10 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించారు. ఈ విషయంలో హైకోర్టులో బీఆర్ ఎస్ పార్టీ కేసు వేసిందని రవీందర్ రావు తెలిపారు. ఈ విషయంలో హై కోర్టు సింగిల్ బెంచ్ నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తీర్పు నిచ్చింది. అసెంబ్లీ సెక్రటరీ నర్సింహ చార్యులు హై కోర్టు డివిజన్ బెంచ్‌కి తిరిగి అపీల్ చేసుకొని పునరాలోచించుకోవాలని చెప్పారు. డివిజన్ బెంచ్ స్పీకర్లను ఆదేశించే అధికారం న్యాయ స్థానానికి లేదని అభిప్రయపడిందని తక్కళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని, కాలపరిమితిని న్యాయ స్థానం విధించలేదని న్యాయ స్థానం పేర్కొందని తెలిపారు. ఆ డివిజన్ కోర్టు తీర్పుపై బీఆర్ ఎస్ ( BRS) పార్టీ సుప్రీం కోర్టులో ఆపీల్ చేసిందని రవీందర్ రావు తెలిపారు. సుప్రీం కోర్టు ( SUPREEM COURT) పది మంది ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు పంపించి, వారి నుంచి వివరాలు సేకరించి స్పీకర్ మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు చట్ట పరమైన విషయాలలో ఇంకొన్ని మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ నిర్ణయ విషయాల్లో ఇంకొన్ని ముఖ్య విషయాలపై చట్టపరంగా నిర్ణయం తీసుకోవాలని నిగూఢంగా సూచించిందన్నారు. స్పీకర్ తన నిర్ణయాన్ని స్పష్టంగా వెలిబుచ్చుతారో లేక కాలయాపన చేస్తారో వేచి చూడాలని తక్కళ్ల పల్లి రవీందర్ రావు అన్నారు. ఇప్పటికే స్పీకర్ (SPEAKER )సీఎం అడుగులకు మడుగులొత్తుతూ కాలయాపన చేశారని విమర్శించారు.కాంగ్రెస్ పాలన తీరు చూసి ప్రజలు విసిగి పోయారని అన్నారు.వారు చేస్తున్న అక్రమాలు అరాయకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తక్కళ్లపల్లి రవీందర్ రావు హెచ్చరించారు.
………………………………………………….