
*సృష్టి ఫెర్టిలిటీ భవనంలో వెలుగు చేసిన వైనం
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : విశాఖపట్టణంలో క్షుద్రపూజల కలకలం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో విశాఖపట్టణంలో నిర్మాణ దశలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ భవనంలో క్షుద్ర పూజలు చేసినట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి. నిర్మాణ దశలో ఉన్న ఓ భవనంలో 5, 6 ఫ్లోర్లలో కొనసాగిస్తున్నారు. అదే భవనం మొదటి అంతస్తులో హోమం జరిగినట్లు ఆధారాలను పోలీసులు గుర్తించారు. క్షుద్రపూజలు ఎవరూ చేశారనే కోణంలో విచారణ చేపట్టామని వెల్లడించారు.. మొదటి అంతస్తులో పూజలు ఎవరు? ఎందుకు? చేశారు.. సృష్టి సిబ్బంది చేశారా అనే సందేహాలు అధికారులను రేకెత్తిస్తున్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Srushti Fertility Center) కేసులో డాక్టర్ నమ్రత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలో ఖైదీగా ఉన్నారు. ఆమెను గోపాలపురం పోలీసులు కస్టడీకి తీసుకొని, నేటి నుంచి ఐదు రోజులు నమ్రతను విచారించనున్నారు. నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్‌తో పాటు పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు లేని దంపతుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో(Srushti Fertility Center) సరోగసి మాటున శిశివుల విక్రయాలు జరిగాయని నిర్దారణ కావడంతో డాక్టర్ నమ్రతను పోలీసును అరెస్ట్ చేశారు.
………………………………………..