
* ఆ తర్వాతేం చేశాడంటే..
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆమె ఏడు నెలల గర్భవతి.. అయితే నేం… భర్తతో గొడవలు.. ఇల్లు వదిలి చెల్లి ఇంట్లో ఐదు నెలలుగా మకాం. అతడిలో రగులుతున్న ఆగ్రహావేశాలు.. భార్య చెల్లె ఇంటికి వెళ్లి.. భార్యతో మాట్లాడాలని చెప్పి.. భార్యను తీసుకొని మొదటి అంతస్తులోకి.. డోర్ లాక్ చేసి.. కత్తితో గొంతు కోసి, పలు చోట్ల పొడిచి హత్య చేసి…భార్యను హత్య చేసినట్లు పోలీసులకు ఫోన్ చేసి పట్టు బడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్(UTTAR PRADESH) లోని మీరట్ (MEERAT)కు చెందిన రవిశంకర్ (RAVI SHANKAR), స్వప్న (SWAPNA)దంపతులకు 2025 జనవరిలో వివాహం జరగగా, ఏడు నెలల గర్భవతి. భర్తతో గొడవల వల్ల స్వప్న ఐదు నెలలుగా అమ్హెరా ప్రాంతంలోని సోదరి ఇంట్లో నివసిస్తున్నది. ఇదిలా ఉండగా, శనివారం ఉదయం రవిశంకర్ అక్కడకు వెళ్లి… భార్య స్వప్నతో మాట్లాడటానికి వచ్చినట్లు ఆమె సోదరి కుటుంబ సభ్యులకు చెప్పి, మొదటి అంతస్తులోని ఒక గదికి భార్యను తీసుకెళ్లి డోర్ లాక్ (DOOR LOCK)చేశాడు. వెంట తెచ్చిన కత్తితో స్వప్న గొంతుకోసి, శరీరంపై చనిపోయే వరకు కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. డోర్ లాక్ చేసి ఉండటంతో స్వప్న అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమెను కాపాడలేకపోయారు. రవిశంకర్ పోలీసులకు ఫోన్‌చేసి తన భార్యను చంపినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి ఆ గదిలోకి వెళ్లి, రక్తం మడుగుల్లో పడి ఉన్న భార్య మృతదేహం వద్ద ఉన్న రవిశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వప్న మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
………………………………………………..