
* ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న నీరు
* స్పిల్ వే గేట్లను ఎత్తివేసిన అధికారులు
ఆకేరు న్యూస్ డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు ( SRISHIALAM PROJECT) పొంగి పొర్లుతోంది. అధికారులు నాలు స్పిల్ వే గేట్ల (SPILWAY GATES) ను ఎత్తివేసి దిగువకు నీరు వదులుతున్నారు. అధికారులు పది అడుగుల వరకు గేట్లు ఎత్తి వేశారు. జూరాల సుంకేషుల నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్( NAGARJUNASAGAR) కు 1.08.076 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డు పాడు (POTHIREDDY PADU) హెడ్ రెగ్యులీటరీ నుంచి 35వేల క్యూసెక్కులు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30.808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.02.456 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
……………………………………..