* ప్రభుత్వంపై హరీశ్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గోదావరి పరివాహకంలో చాలా జలాశయాలు ఖాళీగా ఉన్నాయని, ఎల్లంపల్లి నుంచి వెంటనే రోజుకు రెండు టిఎంసిల నీళ్లు ఎత్తిపోయాలని, ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఏడు మోటర్లు ఉంటే రెండు మాత్రమే నడుపుతున్నారని హరీశ్ మండిపడ్డారు. మిగతా మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని హరీశ్ ప్రశ్నించారు. మీకు చేతకాక పోతే మేం ఆన్ చేసి చూపిస్తామని మాజీ మంత్రి హరీశ్ అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్ నేతల మీద కోపం ఉంటే.. రైతులకు శిక్ష వేస్తారా? బురద రాజకీయాల కోసం వరద నీళ్లను సముద్రంలోకి వదలకండి. కాళేశ్వరం కూలిందని గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. కావాలనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం లేదు. ప్రజలకు కీడు చేస్తే.. అది ప్రభుత్వమే అనుభవిస్తుందని అన్నారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కు నీటి విలువ తెలియదని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే భారీ వరదను గెట్లు ఎత్తి నీటిని వృథా చేస్తున్నారని, 60 వేల క్యూసెక్కుల వరదను సముద్రంలోకి వదులుతున్నారని ఎద్దేవా చేశారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
