* రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు
* ములుగు జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి
ఆకేరున్యూస్,ములుగు : వచ్చే 5 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు మన జిల్లా లో కురిసే
అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జేసీ దివాకర్ తెలిపారు. గ్రామపంచాయతీ లలో ఈరోజు, రేపు ప్రజలని అప్రమత్తం చెయ్యాలని జిల్లా కలెక్టర్ జేసీ దివాకర, ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాలు కోరారు. ఈ వర్షా కాలంలో అధికారులు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు వివరించారు.
ఏదైనా సహాయం కోసం …
ఏదైనా అత్యవసర సహాయం కోసం ములుగు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-7109,
ITDA ఏటూరునాగారం టోల్ ప్రీ నెంబర్ 08717-293246 ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు.
మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్ లు SI లు,
మండల పంచాయతీ అధికారులు మీ మీ మండలాలలో గత మూడు సంవత్సరాలుగా వర్ష పాతం నమోదైన ప్రాంతాలలో ఊర్లు మునిగిపోయే ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు cut off
ప్రాంతాలు, నెట్వర్క్ లేని ప్రాంతాలని గుర్తించి , వరదలు సంభవించినప్పుడు
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టే విధంగా సిద్ధంగా ఉండాలని తెలిపారు.గ్రామస్థాయిలో
పంచాయతీ కార్యదర్శి మొబైల్ టీం ఏర్పాటు చేసి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, ngo లు, మహిళా సమాఖ్య సభ్యులు, రేషన్ డీలర్లు , యువతను సమన్వయ పరుస్తూ ప్రణాళిక బద్ధంగా గ్రామాల్లో వరద ఉత్పత్తికి కారణమయ్యే ప్రాంతాలు గుర్తించాలి తగు చర్యలు చేపట్టాలన్నారు.పొంగుతున్న వాగులు దాటకుండా పటిష్ట నియంత్రణకు పోలీస్ సహాయంతో బారికెట్లు, ఫ్లెక్సీలు, డేంజర్ బోర్డు లు ఏర్పాటు చేయాలన్నారు.అవసరం అయితే జీపీ ట్రాక్టర్ లను అడ్డు గా ఉంచాలి. జీపీ సిబ్బంది కి అక్కడ డ్యూటీ వెయ్యాలి. రోడ్ కట్ ఆఫ్ అయినా రహదారిపై రవాణా నియంత్రణకు సూచిక బోర్డులను, ఫ్లెక్సీ లను, డేంజర్ బోర్డు లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
లోతట్టు ప్రాంతాలలో …
ఊర్లో లోతట్టు ప్రాంతాలు,మునిగిపోయే గ్రామ పంచాయితీలోని ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించడం కోసం పునరావాస కేంద్రాలను ఎత్తైన ప్రదేశాలలో స్కూల్లో హాస్టల్ నందు, గ్రామపంచాయతీ నందు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మరియు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. జెసిబిలు డోజర్లు, వుడ్ కట్టర్ లు అందుబాటులో పెట్టుకోవాలి అవసరాన్ని బట్టి వీటిని వినియోగించాలని కలెక్టర్ సూచించారు.వరదల సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని గర్భిణులు అత్యవసర చికిత్స పొందుతున్న రోగులను గుర్తించి ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలని కోరారు. గోదావరి పరివాహక గ్రామాలలో గోదావరి పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టి ప్రజలను హాస్టల్లో, గురుకుల పాఠశాలల చదివే విద్యార్థులకు వర్షాకాలంలో మందులు, ఆహారం,మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. అన్ని విద్యాసంస్థలు పరిశుభ్రం గా ఉండే విధంగా చూడాలి, పిచ్చి మొక్కలు తొలగించడం, బ్లీచింగ్ చల్లించాలని కోరారు
వైద్యసేవలు అందుబాటులో ఉండాలి
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు చికిత్సకు అవసరమయ్యే మందులను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.పంచాయతీ కార్యదర్శిలు
గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి వారికి నోటీసు లు ఇచ్చి వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరారు. విద్యుత్ శాఖ తో సమన్వయం చేసుకొని వంగిన విద్యుత్ పోల్స్
అలాగే పడిపోయే దశలో ఉన్న చెట్లను గుర్తించి తొలగించాలని ఆదేశించారు.
ఎటువంటి అంటురోగాలు ఎత్తకుండా ప్రతి కాలనీలో బ్లీచింగ్ చేయించాలి,stagnated వాటర్ bodies లో ఆయిల్ బాల్స్ వెయ్యాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రతి గ్రామపంచాయతీలో fogging చేయించాలి ప్రతి గ్రామపంచాయతీలో బ్లీచింగ్ సున్నం కెమికల్స్ అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
చెరువుకట్టలను పరిశీలించాలి
ఇరిగేషన్ అధికారులు తో సమన్వయం చేసుకొని చెరువు కట్టలను పరిశీలించాలని పేర్కొన్నారు.
వరద సమయంలో తెగకుండా రక్షణ చర్యలు చేపట్టాలి ఇసుక బత్తాలు నింపుకొని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.RWS వారితో సమన్వయం చేసుకొని త్రాగు నీరు కలుషితం కాకుండా మంచినీటి పైపులను పరిశీలించి మరమ్మత్తులు చేయించాలి, ohsr లు క్లీనింగ్ చేయించాలి,క్లోరోస్కోప్ తో వాటర్ టెస్టింగ్ చేయించి పరిశుభ్రమైన త్రాగు నీరు ప్రజలందరికి అందించాలి, గ్రామ పంచాయతీ లోని ప్రజలందరూ కాచి వడపోసిన నీరు తాగే విధంగా, వేడివేడి ఆహార పదార్థాలు తినే విధంగా ప్రచారం, TAM TAM చేయించాలని సూచించారు.ఇరిగేషన్ అధికారులు ప్రతి చెరువు దగ్గర సైన్ బోర్డు ఏర్పాటు చేసి చెరువుల స్టోరేజ్ వివరాలు ఎప్పటికప్పుడు గ్రామ, మండల స్థాయి అధికారులకు తెలియపరచాలని కోరారు.
పశువులను జాగ్రత్తగా చూసుకోవాలి
పశుసంవర్ధక శాఖ ద్వారా వాన కాలంలో పశువులకు వచ్చే సీజనల్ వ్యాధులను సంబంధించిన అన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలి వర్షాలు కురిసినప్పుడు పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.మత్స్యశాఖ వారి సమన్వయంతో వరదల సమయంలో గజఈత గాళ్ళు ని ఏర్పాటు చేసుకోవాలి మత్స్యకారులను చాపల వేట కు వెళ్లకుండా
టామ్ టామ్ వేయించాలని సూచించారు.
లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి
వరదలు సంభవించినప్పుడు తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
లైఫ్ జాకెట్లు, తిప్పలు ఏర్పాటు చేయాలి, టార్చ్ లైట్ లు, రోప్ లు, ట్యూబ్లు అందుబాటులో ఉంచుకోవాలి అవసరం ని బట్టి NDRF టీము లతో నిరంతరం కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో వర్షాలకు గాలులు సంభవించే సమయంలో అప్రమత్తంగా ఉండేవిధంగా శిధిలావస్థలో ఉన్న కరెంటు పోల్స్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి చెట్ల కింద ఉన్న కరెంట్ తీగలు, పంట పొలాల్లో, రోడ్లపై కిందికి వేలాడే కరెంట్ తీగలను గుర్తించి మరమత్తులు చేయించాలని కోరారు.గ్రామ, మండల, జిల్లా అధికారులు అత్యవసర సేవలకు గాను కార్య స్థానంలో అందుబాటులో ఉండాలని వివరించారు.
………………………………………….
