* సీఎం ను కలిసిన రోహిత్ వేముల తల్లి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రోహిత్ వేముల ( Rohith Vemula ) ఆత్మహత్య కేసు పునర్విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) హామి ఇచ్చారు. శనివారం రోహిత్ వేముల తల్లి రాధిక, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలతో కలిసి ఆమె సీఎం ను కలిశారు. ఇదే అంశంపై డీజీపీ రవి గుప్తా కూడా స్పందించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును రీ ఓపెన్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ప్రకటించారు.. పోలీసులు సమర్పించిన నివేదిక మీద రోహిత్ తల్లి రాధిక ఇతరులు అభ్యంతరాలు తెలిపినందున తిరిగి విచారణ చేసేందుకు నిర్ణయించామని డీజీపీ పేర్కొన్నారు. కాగా రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, నిందితులు నేరానికి పాల్పడినట్లు ఆధారాలు , సాక్ష్యాలు లేవని హైకోర్ట్‌కు పోలీసులు నివేదిక సమర్పించారు. దీంతో కేసును కొట్టి వేస్తూ కింది కోర్టులో అభ్యంతరాల కోసం ఆశ్రయించే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రో హిత్ వేముల ఆత్మహత్య 2016 లో జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. రాజకీయ ప్రకంపనాలను రేపింది. రోహిత్ ఆత్మహత్య కేసు మూసి వేయడంతో మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
* సీఎం ను కలిసిన రోహిత్ తల్లి
సీఎం రేవంత్ రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక శనివారం కలిసింది. ప్రజా సంఘాల నేతలతో కలిసి ఆమె సీఎంను కలిశారు. పోలీసులు చాలా అన్యాయం చేశారని మరోసారి కేసు విచారణ జరిపించాలని కోరారు. కులం విషయంలో కూడా చాలా తప్పడు రిపోర్ట్లు సమర్పించారన్నారు. కేసు పునర్విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూస్తానని సీఎం హామి ఇచ్చారు.
———————————–