ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుకాలేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిర్మల్ లో జరిగిన జనజాతర సభలో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభలో రేవంత్ మాట్లాడుతూ “ఈ వేదిక నుంచి కేటీఆర్ కు ఒక సూచన చేస్తున్నా.. అయ్యా.. నీకు సినీ పరిశ్రమ వాళ్లు బాగా తెలుసు కదా.. నువ్వు చీరకట్టుకుని ఆడపిల్లలా మంచిగా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు.. నిన్ను కండక్టర్ టికెట్ ఆడిగితే ఆరు గ్యారెంటీలు అమలు కానట్లే. టికెట్ అడగకపోతే.. ఆరు గ్యారెంటీలు అమలు అయినట్లే” అని ఎద్దేవా చేశారు. ఈ నెల 9 లోపు రైతులందరికీ రైతుబంధు పడుతుందని చెప్పారు.
————————–