కల్యాణదుర్గం
* రాళ్లతో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ వర్గాలు
* అనంతపురం కల్యాణదుర్గంలో ఘటన
ఆకేరు న్యూస్, అనంతపురం : ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లోనే కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు పార్టీలకు చెందిన వారూ ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలింగ్ కేంద్రం ఆవరణలోనే ఈ ఘటన జరగడంతో ఓటు వేయడానికి వచ్చిన ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలనూ చెదరగొట్టారు. ఉదయం నుంచి కూడా కల్యాణదుర్గంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఈఘటనపై విచారణకు ఎన్నికల అధికారులు ఆదేశించారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
