
* తెలంగాణ కేబినెట్ ఆమోదం
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ప్రభుత్వం తెరదింపింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించడంతో పాటు సెప్టెంబర్ లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. తెలంగాణలో 33 జెడ్పీ చైర్ పర్సన్ స్థానాలు 540 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా 129 మున్సిపాలిటీలు ఉన్నాయి.11,361 మంది సర్పంచ్ లు ఉన్నారు.
ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా కోదండరాం, అజహరుద్దీన్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాంతోమ పాటు మాజీ మహ్మద్ అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపధ్యంలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన అజహర్ కు తిరిగి జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారని అందరూ భావించారు. అజహర్ కూడా జూబ్లీ టికెట్ ఆశించారు. ఈ నేపధ్యంలో అజహర్ పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించడంతో జూబ్లీ టికెట్ ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠగా మారింది.
…………………………………..