
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం మహా జాతర నిర్వహణకు మంజూరు చేసిన నిధులలోనే రెండవ పంట నష్టపరిహారం అర్హులైన రైతులకు అందించాలని నష్టపరిహార కమిటీ అధ్యక్షుడు ఆలం కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల మహా జాతర ఆదివాసీ సాంప్రదాయాల నడుమ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక లాంఛనాలతో గిరిజన పూజారులు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతీ రెండేళ్ళకొకసారి జరిగే ఈ మహా జాతర నిర్వహణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నది ఈ సారి 2026 జనవరి నెలలో జరగనున్న జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. జాతర అభివృద్ధి పనుల కోసమే కాకుండా మేడారం పరిసర గ్రామాలైన ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం, నార్లపూర్, వెంగళాపూర్ ల రైతులు సుమారు వందల ఎకరాల పంట భూములను పంటలు వేయకుండా బీడు గా ఉంచడం జరుగుతుంది దీంతో సుమారు రెండు వేయిల మంది రైతులము పంట నష్టపోతున్నామని ఆవేధన చెందుతున్నారు.
జాతర అభివృద్ధి పనుల కై కెటాయించిన నిధులతో పాటు రైతులను దృష్టిలో పెట్టుకుని పంటలు వేయని రైతుల సర్వేలు చేపట్టి ఎకరాకు 50 వేయిల రూపాయలు పరిహారం అందించాలని బాదిత రైతులు డిమాండ్ చేశారు. జాతర ప్రారంభంలోనే నష్టపరిహారాన్ని అందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ మేడారం తో పాటు మరో మూడు గ్రామపంచాయితీల రైతులంతా ఏకమై మేడారంలోని సమ్మక్క భవన్ లో సమావేశమై మేడారం జాతర పంట నష్ట పరిహార కమిటీని ఎన్నిక చేసుకున్నారు. ఈ కమిటీ ద్వార ప్రభుత్వానికి రైతుల పంట నష్టపరిహారకై పోరాడనున్నట్లు రైతులు తెలిపారు.
కమిటీ అధ్యక్షులుగా మేడారంకు చెందిన ఆలం కృష్ణ ను ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షులు:
గొoది.రమేష్
భుక్య. శ్రీను
జంగ. హనుమంత రెడ్డి
అల్లెం.కిరణ్
ప్రధాన కార్యదర్శులు:
దబ్బ. సాంబశివరావు
చర్ప.చంద్రశేఖర్
మొక్క.నరేందర్
ఎల్లబోయిన.ముత్తేష్
గౌరవ అధ్యక్షులు రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి గారు…
ముఖ్య సలహాదారులు:
చిడం.బాబురావు
గొంది. శ్రీధర్
సిద్ధబోయిన. శివరాజ్
జీడి. బాబురావు
సోలం వెంకన్న
పీరీల. వెంకన్న
గోపాలపురం.సతీష్
నల్లమొక్క. లక్ష్మీ సమ్మయ్య
సంకె.ప్రణయ్
ఆలం. సమ్మారావు మరియు కార్యవర్గ సభ్యులు మరియు నాలుగు గ్రామపంచాయతీల రైతులు పాల్గొన్నారు. అనంతరం రైతులంతా కలిసి నష్టపరిహార డబ్బులు ఇప్పించాలని వనదేవతలను దర్శించుకుని వినతి పత్రం సమర్పించారు.
……………………………………………..