
* అసెంబ్లీలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయడం గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం తమ మంత్రి వర్గంలో బీసీలకు 42 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రెండో రోజు మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లడారు. వాడిగా వేడిగా కొనసాగిన ఈ సమావేశాల్లో గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అమలకు 9వషెడ్యూల్ లో మార్పు చేయాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై శాస్త్రీయంగా సర్వే చేయకపోతే చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బీఆర్ ఎస్ అంటేనే బహుజన రాష్ట్రీయ సమితి అని కమలాకర్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని గంగుల స్పష్టం చేశారు. చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బిల్లును పాస్ చేయాలని గంగుల ప్రభుత్వాన్ని కోరారు.
……………………………………………….