
* పత్రికా ప్రకటన విడుదల చేసిన పార్టీ
* కవిత పార్టీ టీఆర్ ఎస్ ..?
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : బీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై వేటు వేసింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం ఈ మేరకు చర్యలు తీసుకున్నామని పార్టీ నేతలు టీ రవిందర్ రావు , సోమ భరత్ కుమార్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత గొంత కాలంగా కవిత బీఆర్ ఎస్ పార్టీపై విమర్శలు చేస్తోంది.గతంలో బీఆర్ ఎస్ పార్టీ బీజేపీలో కలువబోతోందని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ ఎస్ లో దయ్యాలు ఉన్నాయంటూ ఆ దయ్యాల వల్లే పార్టీ పరువు పోతోందంటూ కామెంట్స్ చేశారు. తాజా గా కవిత నిన్న అమెరికా నుంచి వచ్చిన తరువాత ఆమె చేసిన కామెంట్స్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఈ నేపధ్యంలో ఆమెను పార్టీ నుంచి తొలగించేందుకే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని రేవంత్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన నేపధ్యంలో కవిత సీరియస్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం అవినీతి వెనుక హరీష్ రావు ఉన్నారని అందుకే హరీష్ రావును రెండో సారి బాధ్యతల నుంచి తప్పించారని చెప్పారు. అలాగే కేసీఆర్ కు సన్నిహితంగా వ్యవహరించే సంతోష్ రావుపై కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ మీద మరకలు పడడానికి ఈ ఇద్దరు నేతలే కారణమని ఆరోపించారు. గత పదేళ్లలో అధికారంలో ఉండగా వీరిద్దరు నేతలు లెక్కలేనంత ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని భావించిన పార్టీ నేతలు కవితను పార్టీనుంచి బహిష్కరించడానికే నిర్ణయం తీసుకున్నారు.
కవిత కొత్త పార్టీ.. టీఆర్ఎస్ ..?
పార్టీ నుంచి ఉద్వాసన నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొత్త పార్టీ కార్యాలయం కోసం అవసరమైన భవనం కూడా అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడినప్పుడు ఇలాంటి చర్యలు ఉంటాయని కవితకు ముందే ఊహించి ఉంటుందని ఆమె అనుచరులు అంటున్నారు. ఎలాంటి చర్యలకైనా వెనుకాడకుండా ఇక తాడో – పేడో అన్నట్లుగానే దూకుడుగా ముందడుగు వేయాలని కవిత యోచిస్తున్నట్లు వారి అంతరంగికులు చెబుతున్నారు. ఇక పార్టీ పేరు విషయానికి వచ్చే వరకు టీఆర్ ఎస్ అంటేనే బాగుంటుందని అనకుంటున్నట్లుగా తెలుస్తోంది . టీఆర్ ఎస్ పేరు ప్రజల గుండెల్లో నిలిచి పోయిందని అందుకోసమే టీఆర్ ఎస్ అనే పెడితేనే బాగుంటుందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సాంకేతికంగా టీఆర్ ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకునే అవకాశం లేదంటున్నారు. అ నేపథ్యంలో టీఆర్ ఎస్ అని వచ్చే విదంగా తెలంగాణ రాష్ట్ర సమితి అని కాకుండా మరో పేరు పెట్టాలని కవిత ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. కాగా ఈ మధ్య కాలంలో కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారు. పలు వేదికల్లో ఆమె బీసీల అధికారం గురించి బీసీలకు రావాల్సిన వాటాల గురించి మాట్లాడుతున్నారు, ఈ నేపధ్యంలో ఆమె పెట్టే పార్టీలో బీసీలను హైలెట్ చేయవచ్చని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె పెట్ట బోయే పార్టీకి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పేరు ఖరారు చేయవచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి.
——————————