* వారిపై చర్యలు తీసుకోవద్దు
* రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై పీసీ ఘోష్ కమిషన్
ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు లపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్
విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి
చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన కేసీఆర్, హరీష్ రావు
హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై మంగళవారం కేసీఆర్,
హరీష్ రావు తరపు న్యాయవాదుల వాదనలు విన్న తరువాత, అక్టోబర్ 7వ తేదీన
దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని పేర్కొన్న
హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అప్పటి వరకు కమిషన్ ఆధారంగా
కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని తెలంగాణ
హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పీసీ ఘోష్ కమిషన్
ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని పేర్కొంది.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
