* కేసీఆర్ కుటుంబ గొడవలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం
* కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది
* స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, జనగామ : బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయినందుకేనని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా ఆరోపించారు. జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్ నుంచి సాగునీటిని శుక్రవారం విడుదల చేసి, మీడియాతో మాట్లాడారు. కవిత లిక్కర్ కేసులో విచారణను ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండటం సరైన పద్ధతి కాదని తాను బయటకు వచ్చానన్నారు. కేసీఆర్ కుటుంబ గొడవలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అవినీతి డబ్బులను పంచుకోవడంలో వారి మధ్య జరిగిన గొడవే తప్పా.. మరి ఇంకా ఏం లేదని విమర్శించారు. పదేళ్ల అధికారంలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుందని ఘాటుగా విమర్శించారు. ధరణిని అడ్డుపెట్టుకొని వేల ఎకరాల భూములు కబ్జా చేశారని , కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబం రూ. వేల కోట్లు సంపాదించిందని తీవ్రంగా ఆరోపించారు. వేల ఎకరాల భూములు, వేలకోట్ల రూపాయలు పంచుకునే క్రమంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని కడియం శ్రీహరి అన్నారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
