Gurudakshina Poetry Anthology
* అంజిబాబు ఫౌండేషన్ సాహిత్య సేవ మరువలేనిది..
* గురుదక్షిణ పుస్తక సంపాదకులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గురుదక్షిణ కవితా సంకలనానికి కవితలు అందించిన కవులు అందరికీ సంపాదకులు, కవి కొండూరి కోటిబాబు, ఎస్. కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. అతి తక్కువ కాలంలోనే అద్భుత కవితలు అందించారని కొనియాడారు. వారి సహకారంతోనే ఇంత చక్కటి పుస్తకం ఆవిష్కృతమైందని అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వేదికగా జరిగిన పుస్తకావిష్కరణ విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.వర్సిటీ విద్యార్థులతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 60 మంది కవులు గురువుల గొప్పదనం చాటుతూ చక్కటి కవితలను ఈ పుస్తకంలో అక్షరీకరించారని అన్నారు. సంపాదకులుగా వ్యవహరించిన విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహించిన వర్సిటీ వీసీ నిత్యానందరావుకు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావుకు, జర్నలిజం విభాగం హెచ్ ఓడీ పద్మప్రియ, అధ్యాపకులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సాహిత్య సేవలో భాగంగా పుస్తక ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన అంజిబాబు ఫౌండేషన్ ఫౌండర్, సీఈఓ నాగుల అంజిబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
* వారం రోజుల్లోనే చక్కటి పుస్తకం
పుస్తక ఆవిష్కరణ సందర్భంగా రిజిస్ట్రార్ హనుమంతరావు మాట్లాడుతూ కేవలం వారం రోజుల్లోనే.. చక్కటి కవితలతో అందమైన డిజైన్ తో అంత మంచి పుస్తకం తీసుకొచ్చారంటే.. వీరు భవిష్యత్తులో మరిన్ని మంచి పుస్తకాలు తీసుకొస్తారని, తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సంపాదకులు కొండూరి కోటి బాబు, ఎస్. కళ్యాణ్ దాస్, నాగుల అంజిబాబులను అభినందించారు. ఈ పుస్తకానికి ఆర్థిక సహకారం అందించేందుకు అంజిబాబు ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషదగ్గ విషయమన్నారు. గురువుల గొప్పదనాన్ని చాటేలా పుస్తకం ఉందని, తమ యూనివర్సిటీ విద్యార్థులు మంచి ప్రయత్నం చేశారని అభినందించారు. గురుపూజోత్సవం సందర్భంగా తనని ఇంతటి వారిని చేసిన తన గురువులను గుర్తు చేసుకుంటూ, తన అనుభవాలను వివరించారు. ఒక్కో టీచర్ లో, ఒక్కో డిఫరెంట్ టాలెంట్ ఉంటుందని తెలిపారు.
* అంజిబాబు ఫౌండేషన్ కు అభినందనలు
విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన గురుదక్షిణ కవితా సంకలనానికి ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన అంజిబాబు ఫౌండేషన్ ను రిజిస్ట్రార్ హనుమంతరావు అభినందించారు. మున్ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సీఈవో ఫౌండర్ అంజిబాబుకు సూచించారు.
* త్రిమూర్తుల గురుదక్షిణ అభినందనీయం
జర్నలిజం విభాగం తరఫున సీనియర్ అధ్యాపకురాలు షేక్ హసీనా మాట్లాడుతూ.. గురుదక్షిణ కవితా సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించిన త్రిమూర్తులు కోటి బాబు, అంజిబాబు కళ్యాణ్ ల కృషి అభినందనీయం అన్నారు. త్రిమూర్తులుగా అభివర్ణించారు. మంచి కార్యక్రమానికి అధ్యాపకుల సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ప్రధాన సంపాదకులు కోటి బాబు మాట్లాడుతూ గురుదక్షిణ పుస్తకం తీసుకువచ్చేందుకు మమ్మల్ని ప్రోత్సహించిన వీసీ, రిజిస్ట్రార్, జర్నలిజం విభాగం శాఖాధిపతి, అధ్యాపకులకు, గురువుల గొప్పతనాన్ని చాటుతూ కవితలను రాసిన కవులకు ధన్యవాదాలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
