Mulugu Lightning Strike Death
Published:
ఆకేరు న్యూస్,ములుగు : ములుగు జిల్లా వాజేడు మండలంలోని చెరుకూరు గ్రామంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది .స్థానికుల కథనం ప్రకారం చింతూరు గ్రామానికి చెందిన ములకల ఆనందరావు (50 ) వ్యవసాయ పనులలో భాగంగా పొలంలో నాగలి దున్నుతున్న క్రమంలో ఒక్కసారి ఉరుములు మెరుపులతో వ్యక్తిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. సమీపంలోని రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విషాద సంఘటనలను తెలుసుకొని కన్నీరు అయ్యారు. మృతునికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
కోగిల సారయ్య , MA (Sociology)
22 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
