* మేడారం అడవుల్లోదారుణ హత్య…
ఆకేరు న్యూస్, ములుగు: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈనెల 3న కిడ్నాప్‌కు గురైన వ్యక్తి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో దారుణ హత్యకు గురి కాగా మృత దేహం శుక్రవారం లభ్యమైంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్‌కు చెందిన మహమ్మద్ బాసిత్ (20) సెప్టెంబర్ 3న తన మిత్రుడు అరుణ్‌తో కలిసి ద్విచక్ర వాహనం పై కోర్ట్ నుండి వస్తున్నక్రమంలో శాంతి నగర్ జంక్షన్ చర్చి వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు బబ్లు, ప్రశాంత్, కుషాల్ మరి కొంత మంది వ్యక్తులు ఇద్దరి పై దాడి చేసి ఎండి బాసిత్‌ను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారాని మృతుడి తల్లి సభియ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం నుండి తాడ్వాయి వైపు వస్తుంటే సుమారు 2కి. మీ దూరంలో రోడ్డు నుండి కుడి వైపు 500 మీటర్ల దూరంలో గుట్ట దిగాక కట్టేసి చంపి కాల్చిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భూపాలపల్లి సీఐ నరేష్, ఎస్ఐ సాంబమూర్తి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, మృత దేహానికి పంచనామా నిర్వహించి భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
