* అడ్డు వస్తే జో బైడెన్ ను కూడా చంపేయాలనుకున్నా..
* అమెరికాలో తెలుగు మూలాలు ఉన్న యువకుడి నేరాంగీకారం
ఆకేరు డెస్క్ : జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ( Adolf Hitler )ను ఆరాధించే ఓ యువకుడికి అమెరికా కోర్టులో నేరం అంగీకరించాడు. . తెలుగు మూలాలు ఉన్న సాయి వర్షిత్ కందుల ( Sai Varsith kandula ) అనే యువకుడు గత ఏడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ( White House ) పై దాడికి తెగబడ్డాడు. నార్త్ వైపు ఉన్న సెక్యూరిటీ బారియర్స్‌ను వ్యాన్ తో ఢీకొట్టాడు. రివర్స్ చేస్తూ మరోసారి ఢీకొట్టాడు. అనంతరం ట్రక్ దిగి నాజీ జెండాను పట్టుకుని నాజీలకు అనుకూలంగా నినాదాలు చేశారు. సెక్యూరిటీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి సాయి వర్షిత్ ను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది మే 22 న ఈ ఘటన జరిగింది.
* జో బైడెన్ ను చంపేద్దామనుకున్నాను
సాయి వర్షిత్ అమెరికాలోని మిస్సోరి ఛెస్ట్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన వాడు. టెక్నాలజీ మీద పట్టు ఉండడంతో డేటా అనలిస్ట్‌గా స్థిరపడాలని అనుకున్నాడట. అడాల్ఫ్ హిట్లర్ అంటే విపరీతమైన అభిమానం. సమర్థవంతమైన నాయకుడు అని సాయి వర్షిత్ అభిప్రాయపడుతాడు. ఆరు నెలలుగా పక్కా ప్లాన్ చేసి వైట్ హైజ్ దగ్గరకు చేరుకున్నాడు. అమెరికాలో ఏకంగా నాజీ రాజ్యం స్థాపించాలన్నదే సాయి వర్షిత్ లక్ష్యమని పోలీసుల విచారణలో వెల్లడించారు. వైట్ హౌజ్‌ను చేజిక్కించుకునే కార్యాచరణలో అడ్డు వస్తే అమెరికా అద్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) కూడా చంపేద్దామనుకున్నాడట. ఇందుకోసం ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థను సంప్రదించి ఏకంగా 25 మంది సాయుధ సిబ్బంది కావాలని అడిగాడు. కుదరక పోవడంతో పెద్ద ట్రక్కులను అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో U-Haul సంస్థకు సంబందించిన చిన్న ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. దీంతోనే వైట్ హౌజ్ మీద దాడికి పాల్పడ్డాడు. కోర్టు విచారణలో సాయి వర్షిత్ తన నేరాన్ని అంగీకరించాడు ఆగష్టు 23న సాయి వర్షిత్‌కు కోర్టు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
———————————-