
* కాంగ్రెస్ గెలిస్తే మీ ఇళ్లలోకి హైడ్రా బుల్డోజర్లు వస్తాయి
* మాజీ మంత్రి హరీశ్‌రావు
* ఉచిత నీళ్లు ఆపాలని చూస్తున్నారు : తలసాని
* కాంగ్రెస్ చచ్చిపోయింది : విష్ణువర్దన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ గెలిస్తే మీ ఇళ్లపైకి హైడ్రా బుల్డోజర్లు వస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Mla Harishrao) విమర్శించారు. ఇళ్లు కూలగొట్టినా ప్రజలు గెలిపించారని రేవంత్ అంటారని, హైడ్రా మరింత దూకుడుగా ఇళ్లను కూలుస్తుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికనుప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ ఎస్.. అభ్యర్థి మాగంటి సునీత (Maganti Suneetha) గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తోంది. ఈనెల 15న అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్న సందర్భంగా నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈక్రమంలో ఈరోజు నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పి.విష్ణువర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సురుకు తగలాలని, కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోవాలని ప్రజలకు సూచించారు.
ఉచిత నీళ్లు ఆపాలని సూచిస్తున్నారు
డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉచిత నీళ్లు బీఆర్ ఎస్ ఘనత అన్నారు. ఉచిత నీటి సరఫరా ఆపాలని చూస్తున్నారని మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas) వెల్లడించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్ నాయకులు ప్రజల ముందుకు వస్తున్నారని, జూబ్లీహిల్స్ కు మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు. గోపీనాథ్ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేసే వారని, ఆయన ఆశయ సాధనకు ప్రజల సహకారం కావాలని మాగంటి సునీత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, టికెట్ కోసం తనను కూడా డబ్బులు అడిగారని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి (Vishnuvardhanreddy) విమర్శించారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ ఎస్ అండగా నిలిచిందని, తాను మాగంటి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ ఎస్ గెలుపు ఖాయమన్నారు. శివమ్మ పాపిరెడ్డి హిల్స్ కు మాగంటి గోపీనాథ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
……………………………………………………….