Mahabub Reddy Supports Bereaved Families, Thorrur
ఆకేరు న్యూస్, తొర్రూర్: మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి రామనరసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డిల తో కలిసి మృతురాలు రామ నర్సమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మూడు వేల రూపాయలు (రూ.3000/-) ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల బియ్యాన్ని అందజేశారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన మూల నాగమ్మ అనారోగ్యంతో మృతి చెందగా మృతురాలు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి బాధితురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబ సభ్యులకు మూడు వేల రూపాయలు (రూ.3000/-), 25 కేజీల బియ్యాన్ని అందించారు.
* ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గార్ల సహకారంతో భాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు జక్కుల రామ్ రెడ్డి, తొర్రూరు పట్టణ యువజన నాయకులు బసనబోయిన రాజేష్ యాదవ్, తొర్రూరు పట్టణ యూత్ అధ్యక్షులు బసనబోయిన మహేష్ యాదవ్, తంగళ్ళపల్లి అశోక్, యర్రం రాజు యాదవ్,మాజీ సర్పంచ్ జీలకర నాగభూషణం, మాజీ ఉపసర్పంచ్ కుంట జయసుధ రవి, వార్డు సభ్యులు కాటo వెంకట్ రెడ్డి, ఎడ్ల నవీన్ రెడ్డి, వడ్లకొండ యాకయ్య, మాదారపు ప్రకాష్, షేక్ అజీమ్, ఎడ్ల నితీష్, మహేందర్, బొమ్మనబోయిన అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
