Tuni Child, Gnaneshwari Missing Case Update
* పెంపుడు కుక్క రిపోర్ట్ వచ్చేసింది
ఆకేరు న్యూస్, డెస్క్: కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ఉత్కంఠకు తెరపడింది. ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన క్లూగా భావించిన పెంపుడు కుక్క అనూహ్య మరణంపై ఇన్నాళ్లు నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఆ కుక్క మృతికి గల కారణాలపై నిపుణులు రూపొందించిన పోస్టుమార్టం నివేదిక ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది.
* అనారోగ్యంతోనే మృతి..
జ్ఞానేశ్వరి అదృశ్యమైన తర్వాత పెంపుడు కుక్క అకస్మాత్తుగా చనిపోవడంతో స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎవరైనా దానికి విషం పెట్టారా? లేదా మరేదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు.
అయితే, తాజాగా వచ్చిన పోస్టుమార్టం నివేదిక ఈ అనుమానాలన్నింటికీ చెక్ పెట్టింది.
ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడం వల్లే ఆ పెంపుడు కుక్క మరణించిందని నిపుణులు తమ నివేదికలో స్పష్టంగా నిర్ధారించారు. దీంతో ఈ కేసులో కుక్క మృతి చుట్టూ అల్లుకున్న విమర్శలు, ప్రచారాలకు తెరపడినట్లయింది.
* కొనసాగుతున్న చిన్నారి ఆచూకీ ..
పెంపుడు కుక్క మృతి సహజంగానే జరిగిందని తేలడంతో, పోలీసులు ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా చిన్నారి జానేశ్వరి ఆచూకీ కనుగొనడంపైనే కేంద్రీకరించారు. సాంకేతిక ఆధారాలు, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. త్వరలోనే ఈ మిస్సింగ్ మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
