* వికారాబాద్ జిల్లాలో దారుణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాల్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను, వదినను ,కన్న కూతురును చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కులకచర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేవూరి యాదయ్య తరచుగా తన భార్య అలివేలుతో గొడవపడుతూ ఉండే వాడు. ఈ నేపధ్యంలో అలివేలు అక్క హన్మమ్య ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న భార్యను, వదిన హన్మమ్మను, పదేళ్ల చిన్న కూతురు శ్రావణిని కత్తితో దారుణంగా చంపాడు. పెద్ద కూతురును చంపబోగా తప్పించుకొంది. తప్పించుకొని ఇరుగుపొరుగు వారిని నిద్రలేపింది. ఇరుగుపొరుగు వారు వచ్చే లోగా యాదయ్య కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభించారు. హత్యలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని డీఎస్పీ వెల్లడించారు.
………………………………………
