* కాకినాడ జిల్లాలో ప్రమాదం
* బస్సు షెల్టర్లో ఉన్న వారిపైకి దూసుకెళ్లిన కారు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాకినాడ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కిర్లంపూడి మండలం (Kirlampudi Mandalam) సోమవారం వద్ద ఆరుగురిపైకి కారు దూసుకెళ్లింది. బస్సు షెల్టర్ లో వేచి ఉన్న వారిపై కారు దూసుకెళ్లడంతో తీవ్ర కలకలం రేపింది. సోమవారానికి చెందిన కొండబాబు (30), ఆనందబాబు (60,) ఏలేశ్వరానికి చెందిన రాజు (60) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు విద్యార్థినులకు సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు టైరు పేలి బస్ షెల్టర్ లో ఉన్నవారిపైకి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ (Mla Jyothula Nehru) హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
