* అందెశ్రీ మృతిపై చంద్రబాబు సంతాపం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : అందెశ్రీ అకాల మరణం బాధాకరమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి తీరని లోటని అన్నారు.
తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించన గొప్పవాడని చంద్రబాబు కొనియాడారు.అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సీఎం చంద్రబాబు తెలిపారు.
……………………………………………..
