Published:
* అందెశ్రీ మృతిపై కేసీఆర్ సంతాపం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ప్రముఖ కవి అందె శ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటని కేసీఆర్ అన్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
……………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
