* ఆదివాసి సంఘాల నాయకులు
ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం ఆచార వ్యవహారాలు కట్టుబాట్లను గౌరవిస్తూ అస్తిత్వం కోల్పోతున్న ఆదివాసీల మూలాలతో మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల ప్రాంగణ అభివృద్ధి ఆదిమ మూలం తో పూజారుల, ఆదివాసీ సంఘాల, ప్రజల విశ్వాసం మేరకు నిర్మిస్తుంటే బి ఆర్ ఎస్ పార్టీ కుటిల బుద్ధితో రాజకీయ రంగు నులిమి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అని, మేడారం సమ్మక్క తల్లి గుడి పై రాజకీయ కుట్రలు చేస్తే సహించేది లేదు అని తుడుందెబ్బ, ఆదివాసి సంఘాల నాయకులు పలువురు ఘాటుగా హెచ్చరించారు
ఆదివాసీ సంఘాల జాక్ ఛైర్మెన్ దబ్బగట్ల సుమన్ అధ్యక్షతన హరిత హోటల్ లో జరిగిన సమావేశం లో ఆదివాసి అనుబంధ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజకీయాలు బయట చేసుకోవాలని హితవు పలికారు, దేశం లో ఎక్కడ ఏ ప్రభుత్వం ఆదివాసీల విశ్వాసాలకు అనుగుణంగా ఆదిమ మూలం నీ బ్రతికించేలా ఆలయ నిర్మాణాలు చేయలేదని నేడు మేడారం లో 3 నుండి 7 గొట్ల పూర్వ చరిత్ర తెలుపుతూ 5000 బొమ్మలతో గుడి నిర్మాణం అవుతుంది అన్నారు ఆది సహించలేక నే మాజీ గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ , ములుగు నియోజక వర్గ ఇంచార్జి బడే నాగా జ్యోతి లు రాజకీయం చేస్తున్నారని అన్నారు.2025 మాఘ పున్నమిలో లో కోయల అస్తిత్వం సజీవంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందన్నారు. డిసెంబర్ 30 లోపు అన్ని పనులు పూర్తి అయ్యి గుడి సిద్ధంగా ఉంటుందనే విషయం తెలియకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఒక దఫా చందూలాల్ రెండవ దఫా సత్యవతి రాథోడ్ లు గిరిజన మంత్రులు లుగా ఉండి జాతర నీ బ్రస్టు పట్టించినది సరిపోక మళ్ళీ లంబాడీల కుట్రలతో విమర్శలు చేస్తున్నారా అని మండిపడ్డారు. ఈ దఫా మేడారం లో రాజకీయ కుట్రలకు తావు లేదు అని అందరం సహకరించి విజయవంతంగా జాతర నిర్వహణ చేసుకోవడమే ముందున్న లక్ష్యం అన్నారు. అధికార పక్షం ఆదివాసీల విశ్వాసాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని అన్నారు. ఈ సమావేశం లో తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి పోడియం బాబు, మేడారం జాతర చైర్మన్ అరేంలంచ్చుపటేల్ ,గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముద్దబోయిన రవి. విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి,తుడుండెబ్బ జిల్లా అధ్యక్షులు పాయం కోటేశ్వరరావు తుడుందేబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య. వంక నరేష్ లు పాల్గొన్నారు.
……………………………………………….
