Station Ghanpur Degree College
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
గురుకులాలు, కస్తూరిభా గాంధీ పాఠశాలలు, మాడల్ స్కూల్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్, డిగ్రీ కళాశాలతో రానున్న రోజులల్లో స్టేషన్ స్టేషన్ ఘన్ నియోజకవర్గాన్ని విద్యా హబ్ తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.
నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ సంబంధిత అలాట్ మెంట్ కాపీని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఎస్సి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాల నిర్మాణానికి మార్గం సుగమం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటారని తెలిపారు. నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు, కస్తూరిభా గాంధీ పాఠశాలలు, మాడల్ స్కూల్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్‌తో పాటు డిగ్రీ కళాశాల కూడా అతి త్వరలోనే స్వంత భవనంలో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు రానున్న రోజులల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని విద్యా హబ్ తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు పేర్కొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
