Geetha Workers Bus Yatra
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లి సర్పంచ్ ముక్కెర స్వరూప రవి గీతన్నల బస్సు యాత్ర పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మాచర్ల రఘురాం, మండల కార్యదర్శి పులి శ్రీనివాస్ మాట్లాడుతూ అపరిస్కృతంగా ఉన్న గీతా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు మానుకోట నుంచి చేపట్టే గీతన్నల బస్సు యాత్ర ట్యాంక్ బండ్ చేరుతుందన్నారు. ఈ బస్సు యాత్రలో గ్రామాల వారిగా గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు వారు తెలిపారు. ప్రధానంగా ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి, వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కార్మికుడికి అటమయ్య రక్షణ కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో తాటి, ఈత వనాలను పెంచేందుకు తోడ్పాటు అందించాలన్నారు. ట్యాంక్ బండు పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గీతా కార్మికులకు రూ. 4 వేల పెన్షన్, ప్రమాదవశాత్తు తాటిపై నుండి పడి మృతి చెందిన కార్మికునికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, 50 సంవత్సరాలు దాటిన కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీతా కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు చేపట్టిన బస్సు యాత్రను జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గోవిందు ఇసాక్ సొసైటీ అధ్యక్షులు బూరు వెంకటేశ్వర్లు, బూరు మల్లేశం, బూరు యాదగిరి కనకటి వెంకటయ్య బూరు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
