* విద్యార్థి సంఘాల దాడి నేపథ్యంలో నిర్ణయం
* ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆకేరు న్యూస్, వరంగల్ :హన్మకొండలోని ప్రయివేటు పాఠశాలపై విద్యార్థి సంఘాలు దాడికి పాల్పడడంతో స్కూళ్లు బంద్ పాటిస్తున్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు స్మైల్ డీజీ పాఠశాల యాజమాన్యంపై దాడికి పాల్పడుతున్న వీడియో ఒకటి వైరల్గా మ ఆరింది.విద్యార్థి సంఘాల నాయకులు చందాల విషయంలో సదరు స్కూల్ యజమానిపై గొడవకు దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రయివేటు పాఠశాలలు బంద్ పాటిస్తున్నట్లు ట్రస్మా ప్రతినిధులు ప్రకటించారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు.
