* కవిత మొసళి కన్నీళ్లు కారుస్తున్నారు
* అధికారంలో ఉన్నప్పు ఏం చేశారు
* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్, హనుమకొండ : వరంగల్ నగరంలోని పలు కాలనీల్లో తుఫాన్ వల్ల నష్ట పోయిన వరద బాధితులకు సీఎం 15 రోజుల్లోనే 12.8 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ సిటీకి అండర్ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామని ప్రగల్భాలు పలికారని అన్నారు. పదేళ్లు వాళ్లు చేసిన నిర్వాకం వల్లే ఇటీవల నగరం వరదల తాకిడికి అల్లకల్లోలం అయిందన్నారు. పదేళ్ల కాలంలో వరంగల్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నాయిని అన్నారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పదేళ్లలో ఏ నాడూ ప్రజల వైపు కన్నెత్తి చూడలేదని రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ మొసళి కన్నీళ్లు కారుస్తున్నారని అన్నారు. మీ మొసళి కన్నీళ్లకు మోసపోయేంత అమాయకులు కాదు ప్రజలు అని ఎద్దేవా చేశారు. బీఆర్ ఎస్ పదేళ్లలో చేయని అభివృద్ధిని రెండేళ్లలో చేశామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం మాటలతో కాలం గడిపింది : ఎమ్మెల్యే నాగరాజు
పదేళ్ల కాలంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం మాటలతో కాలం గడిపిందని ప్రజలకు చేసింది ఏమీ లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగరాజు మాట్లాడారు. వరద సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపారు.జూబ్లీహిల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ప్రచారం చేసినా ప్రజలు వాళ్ళను తిరస్కరించారని అన్నారు..రేపు వెలువడబోయే రిజల్ట్ లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతుందని అన్నారు..ప్రజా పాలనలో ప్రజలు న్యాయం జరిగేలా మేమందరం కృషి చేస్తున్నామని అన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నిక రిఫరెండమే : ఎంపీ కడియం కావ్య
జూబ్లీ హిల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రెఫరెండమే అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలువ బోతోందని అన్నారు. వరద బాధితులకు తక్షణ సాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.వరంగల్ నగరానికి శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం తో మాట్లాడి నిధులు తేవడానికి కృషి చేస్తున్నానని ఎంపీ కావ్య అన్నారు..
