*ఇంటర్వ్యూకు ఎంపికైన 2736 మంది అభ్యర్థులు
* వెబ్సైట్లో అభ్యర్థుల పేర్లు, హాల్‌టికెట్ వివరాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. 2736 మంది ఇంటర్వ్యూకు ఎంపికైనట్లు ప్రకటించింది. వీరి వివరాలను అభ్యర్థుల పేర్లు, హాల్‌టికెట్ నెంబర్లను వెబ్సైట్లో ఉంచింది. ఆగస్టు 22 నుంచి 31 వరకు జాతీయంగా ఈ పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్లో ఈ ఇంటర్వ్యూలు ఉండనున్నాయి. తెలుగు రాష్ర్టాలకు చెందిన 150 మంది అభ్యర్థులు ఉంటారని పోటీ పరీక్షల శిక్షకురాలు బాలలత తెలిపారు. ఈ ఫలితాల్లో సింగరేణి సంస్థ ద్వారా అందిస్తున్న రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం లబ్ధిదారులు 43 మంది ఎంపికయ్యారు. ఈ ఏడాది ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 202 మంది తెలంగాణ అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున సింగరేణి ఆర్థిక సహాయం చేసింది. నిరుడు 140 మంది ప్రిలిమ్స్‌కు అర్హత సాధించగా, 20 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని తెలిపారు. తాజాగా మెయిన్స్‌కు ఎంపికైన వారికి తలా రూ. లక్ష ఆర్థిక సహాయం చేస్తామని బలరాం వెల్లడించారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులతో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధీనంలో సింగరేణి యాజమాన్యం ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక సాయంతోపాటు వారికి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తోంది.
