* ప్రైవేట్ విద్యాసంస్థల డిమాండ్
*విద్యార్థి సంఘాల దాడి నేపద్యంలో బంద్ పాటిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
*ప్రయివేట్ స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు, ఉపాధ్యాయుల ఆందోళన
* భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ముందు నిరసన
* విద్యార్థి సంఘాల నుండి తమకు భద్రత కల్పించాలని డిమాండ్
ఆకేరుయ న్యూస్, హనుమకొండ : విద్యార్థి సంఘాల పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రైవేట్ విద్యాలయాల యాజమాన్యాలు, సిబ్బంది భారీ నిరసనకు దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ప్రైవేట్ విద్యాలయాలకు విద్యార్థి సంఘాల నుండి రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. నిన్న స్మైల్ డీజీ స్కూల్ యాజమాన్యంపై జరిగిన దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
