* వైద్యుల నిర్లక్ష్యమే అంటూ తల్లీదండ్రుల ఆందోళన
ఆకేరు న్యూస్, నల్గొండ : ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం చోటుచేసుకుంది. వైద్యం వికటించి 17 మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తీవ్ర జ్వరంతో బాధపడుతూ నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. రోజూలాగే చిన్నపిల్లల వార్డులో వైద్యులు ఇంజక్షన్ చేశారు. అరగంట తరువాత వాంతులు.. విరేచనాలు అయ్యాయి. చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో నెలకొ్న్న సంఘటనతో చిన్నారుల తల్లీదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లీదండ్రులు కోరారు.
………………………………………………………
