* 125 రోజులకు పెంచడంతోపాటు రోజు కూలీ రూ.240 పెంపు
* కేంద్ర కేబినెట్ ఆమోదం
ఆకేరున్యూస్ డెస్క్ : జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పేరును కేంద్ర ప్రభుత్వం మార్చుతున్నట్లు సమాచారం. ఈ పేరును మార్చి ‘పూజ్య బాపూ రోజ్గార్ గారంటీ యోజన’ (పీజీఆర్జీవై)గా నామకరణం చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కొత్త పేరుతో పాటు ఈ స్కీం కింద కనీసం ఉపాధి రోజుల సంఖ్యను కూడా కేంద్రం పెంచనుంది. ఇంతకుముందు ఈ పథకం కింద ఏటా కచ్చితంగా వంద రోజుల ఉపాధిని అందించేవారు. ఈ సంఖ్యను 125కు పెంచడంతో పాటు రోజు కూలీని రూ.240కు కేంద్రం సవరించింది. దీని కోసం కేంద్రం 1.5 లక్షల కోట్ల నిధులను కూడా కేటాయిస్తుంది.
………………………………

