*చిన్న పెండ్యాలను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి
*ఆకేరు న్యూస్ స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలం
చిన్నపెండ్యాల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల మరుగుజ్జుల ఆత్మీయ సమ్మేళనం రవీంద్ర భారతిలో జరిగింది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామానికి చెందిన ఇల్లందుల తిరుపతమ్మ స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి గెలుపొందింది. సర్పంచ్‌గా గెలిచిన దివ్యాంగురాలైన తిరుపతమ్మని ఆత్మీయ సమ్మేళనంలో అభినందించారు. ఈ సందర్భంగా చిన్న పెండ్యాల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి ప్రకటించారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్రమంత్రికి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇంచార్జీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు (వెంకన్న) మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
