Fire Accident at Gaming Zone , Gujarat
* గుజరాత్ రాజ్కోట్ లో భారీ అగ్ని ప్రమాదం
* మంటల్లో గేమింగ్ జోన్
* ప్రజల హాహాకారాలతో భీతిల్లిన ఘటనాస్థలి
ఆకేరు న్యూస్, డెస్క్ : చిన్నారుల కేరింతలు, వారిని చూస్తూ ఉప్పొంగుతున్న తల్లిదండ్రులతో ఆ ప్రాంతం అప్పటి వరకు సందడి సందడిగా ఉంది. మహిళలు, పిల్లలుతో ఆహ్లాదకర వాతావరణం వెల్లివిరుస్తోంది. అంతలోనే మంటలు వారిని చుట్టుముట్టాయి. భారీ అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఏకంగా 24 మంది సజీవ దహనం అయ్యారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. గుజరాత్ ( Gujarat ) రాజ్ కోట్లోని ఓ గేమింగ్ జోన్కు వీకెండ్ కావడంతో ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వచ్చారు.
గేమింగ్ జోన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో భారీ అగ్ని ప్రమాదం ( Gujarat Rajkot Fire ) చోటుచేసుకుంది. 24 మంది మంటల్లో మాడి మసైపోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతం బాధితుల హాహాకారాలతో భీతిల్లుతోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గేమింగ్ జోన్ నిర్వాహకుడు యువ రాజ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండానే గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
