* నిజాంపేట వర్టెక్స్ అపార్ట్ మెంట్ లో ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ కేపీహెబీ పరిధిలోని నిజాంపేటలో విషాదం చోటుచేసుకుంది
నిజాంపేట వర్టెక్స్ అపార్ట్ మెంట్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో మూడేళ్ల అర్జున్ కుమార్ అనే బాలుడు పడి మృతి చెందాడు. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్ననిజాంపేట వర్టెక్స్ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన ఎలా జరిగిందనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడ్డాడు అని అనుమానిస్తున్నారు. సీసీ కెమరాల ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడి మృతి తో అపార్ట్ మెంట్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
………………………………………………………..

