* అసెంబ్లీ సాక్షిగా సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడాడు
* తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్
* ఉత్తం కుమార్ రెడ్డి కట్టు కథలు చెప్పారు
*తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణకు మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారని బీఆర్ ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియా సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు ఆడారని ఆవకాశం వస్తే సీఎం రేవంత్ రెడ్డి దేవుడినే మోసం చేసే రకం అని హరీష్ రావు విమర్శించారు. నదీ జలాలపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మంత్రి ఉత్తం అన్ని కట్టు కథలు చెప్పారని హరీష్ రావు ఆరోపించారు. నీళ్లు నిధుల నియామకాల దోపిడీకి తెరలేపిందే కాంగ్రెస్ పార్టీ అని హరీష అన్నారు.ఫజల్ అలీ సిఫార్సులను తుంగలో తొక్కి తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. నీటీ కేటాయింపుల విషయంలో ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో తొక్కి పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణలో 6వందల కిలో మీటర్లు గోదావరి 3వందల కిలో మీటర్లు కృష్ణా నదులు
ప్రవహిస్తున్నా 60ఏండ్లు తాగునీటి కోసం తండ్లాడాం అని హరీష్ తెలిపారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అపర భగీరథుడిగా తెలంగాణకు నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నించారని హరీష్ తెలిపారు.
60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో లో 47 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే అందుబాటులోకి వచ్చింది
కాని పదేళ్లలో బీఆర్ెస్ హయాంలో 48 లక్షల ఆయకట్లు సాధించామని హరీష్ తెలిపారు.
తొమిదేళ్ల పాలనలో 1 లక్షా 81 వేల 473 ఎకరాల ఆయకట్టును అందుబాటులోకి తెచ్చామని తెలిపారు..
31 లక్షల 51 వేల ఎకరాలను స్థిరీకరించామని తెలిపారు. బీఆర్ ఎస్ హయాంలో 11 ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వానికి డీపీ ఆర్ లు పంపించామని తెలిపారు. 7 ప్రాజెక్టులకు అనుమతి పొందాం. చత్తీస్ గడ్ కారణంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు పెండింగ్ లో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తరువాత పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ ప్రాజెక్టులు వాపస్ వచ్చాయన్నారు, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఒక్క డీపీఆర్ ప్రతిపాదించలేదు.. ఒక్క ప్రాజెక్టుకు క్లియరెన్స్ తీసుకురాలేదన్నారు. బీఆర్ ఎస్ సక్సెస్ రేట్ 63 శాతం ఉంటే కాంగ్రెస్ సక్సెస్ రేట్ -30 శాతం ఉందన్నారు.ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును నందికొండకు మార్చి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇయ్యాల వాళ్లు నీళ్ల గురించి మాట్లాడుతున్నరు. అసలు 600 కిలోమీటర్లు గోదావరి, 300 కిలో మీటర్లు కృష్ణానది ప్రవహిస్తున్న ఈ ప్రాంతంలో తాగునీటికి, సాగునీటికి గోసపడే పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం ఈ ప్రాంతాన్ని 60 ఏండ్లకుపైన పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు’ అని ఆరోపించారు.‘గోదావరిలో మన పరివాహక ప్రాంతం 79 శాతం ఉంటే.. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో మనకు దక్కింది 15 శాతం. కృష్ణానదిలో మన పరీవాహక ప్రాంతం 69 శాతం ఉంటే.. కాంగ్రెస్, టీడీపీల పాలనలో మనకు దక్కింది 34 శాతం. రాష్ట్ర విభజన సమయంలో కూడా సెక్షన్ 84 పెట్టి, ఆ సెక్షన్ ప్రకారం నీళ్ల విభజన చేయాలని చెప్పి మనకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలో సోనియాగాంధీ మనకు రక్షణలు కల్పించింది అని చెప్పిండు. ఎక్కడున్నయ్ రక్షణలు..?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

