* యోగ తప్పని సరిగా నేర్చుకోవాలి
* తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సంపద కంటే మనిషికి ఆరోగ్యం ప్రధానమని, అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు. ఎల్బీనగర్ సమీపంలోని సాగర్ రోడ్డు జి ఎస్ ఆర్ కన్వెన్షన్‌లో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో వైద్యుల అపురూప సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతి మనిషిలో యోగ తప్పనిసరి కావాలని, మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వ్యాయామం లేకపోతే శరీరం రోగాల బారిన పడుతుందన్నారు. వైద్యుడు అవసరం లేకుండా జీవించాలని సూచించారు. ప్రతి వైద్యుడు సేవాభావం కలిగి ఉండి రోగులకు సేవ చేయాలని సూచించారు. అంతకు ముందు భరతమాత ధన్వంతరి చిత్ర పటాలకు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య భారతి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను గవర్నర్ ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్షేత్ర (తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు ) ప్రచారక్ భరత్, తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం, శ్రీధర్ , ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘ చాలక్ సుందర్ రెడ్డి, ఆరోగ్య భారతి జాతీయ నాయకులు సునీల్ జోషి మురళీకృష్ణ, క్షేత్ర సంఘటన మంత్రి కుమారస్వామి, విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముక్ పగడాకుల బాలస్వామి, ఎంపీ ఈటెల రాజేందర్, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, వివిధ జిల్లాల నుంచి వైద్యులు విచ్చేశారు.

