* ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న స్కూల్ యాజమాన్యం
* దళితులకు , పేదలకు అన్యాయం జరుగుతోంది
*పారదర్శకంగా సీట్లను భర్తీ చేయాలి
* అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హఐద్రాబాద్ లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న భారతీయ విద్యా భవన్ స్కూల్ యాజమాన్యం తీరుపై అసెంబ్లీలో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.భారతీయ విద్యా భవన్ స్కూల్ లో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన కోటా ఉంటుందన్నారు. కానీ ఆ కోటా అమలు కావడం లేదని దానం తెలిపారు. కోటా ఉంటుందన్న విషయంపై అవగాహన లేక పోవడంతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు
చదువుకునే అవకాశం కోల్పోతున్నారని ఆయన అన్నారు. పాఠశాల యాజమాన్యం తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం ఏకచ్చద్రాధిపత్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టి భారతీయ విద్యాభవన్ స్కూల్ లో ప్రవేశాలపై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. అలాగే హైద్రాబాద్ లో కూడా ఇంటిగ్రేడెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని దానం కోరారు. 25 ఎకరాల స్థలం దొలరకడం ఇబ్బందిగా ఉంటే మనుగడలో లేని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని దానం కోరారు.బంజారా హిల్స్‌లో ఉదయనగర్ అనే బస్తీలో బడుగు బలహీన వర్గాల ప్రజలు పేద ప్రజలు నివసిస్తూ ఉంటారని తెలిపారు. ఆ ప్రాంతంలో స్కూల్ లేదని
నాగేందర్ తెలిపారు. ఆలయానికి చెందిన భూమిలో ఓ పాఠశాల నడుస్తోందన్నారు. ఒకే రూంలో నడుస్తున్న పాఠశాలలో 70 మందికి పైగా విద్యార్థులు ఒకు గదిలో చదువుకుంటున్నారని దానం నాగేందర్ తెలిపారు. ఆలయ కమిటీ అనుమతితో ఆ గదిపైన అదనంగా మరో గదిని నిర్మిస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని దానం అన్నారు. అలాగు ఆ పాఠశాలలో తాగు నీటి వసతితో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన కోరారు.

