* కిరాణా వ్యాపారి దారుణ హత్య
* 18 రోజుల్లో ఆరుగురు హిందువులు హత్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బంగ్లాదేశ్‌లో వరుసగా హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాణాప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన 24 గంటల్లోపే మరో హిందూ వ్యాపారిని చంపేశారు. కిరాణా షాపు నడుపుకునే హిందువును దుండగులుఅత్యంత కిరాతకంగా దాడి చేసి చంపారు.నర్సింగ్డీ జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే చార్సింధూర్ బజార్లో మణి చక్రవర్తి అనే వ్యక్తి కిరాణ దుకాణంతో జీవనాధారం కొనసాగిస్తున్నాడు.సోమవారం రాత్రి అతను షాపులో ఉండగా కొద్దమంది దుండగులు షాపులోకి చొరబడి ఆయుధాలతో దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది గమనించిన స్థానికులు.. తీవ్రంగా గాయపడిన మణి చక్రవర్తిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మణి చక్రవర్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉంటే.. మణి చక్రవర్తి హత్యకు కొద్ది గంటల ముందు జర్నలిస్టు రాణా ప్రతాప్ బైరాగిని దారుణంగా హత్య చేశారు. జెస్సోర్ జిల్లా కేశవ్‌పూర్ గ్రామానికి చెందిన దైనిక్ బీడీ ఖబర్ పత్రికకు బైరాగి యాక్టింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. అలాగే మణిరాంపూర్‌లోని కొపాలియా బజార్లో ఐస్ ఫ్యాక్టరీని కూడా నిర్వహిస్తున్నాడు. సోమవారం ఫ్యాక్టరీ దగ్గరకు బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు బైరాగిని బటయకు పిలిచారు. అనంతరం పక్కనే ఉన్న గల్లీలోకి తీసుకెళ్లి తుపాకీతో మూడుసార్లు కాల్చారు. అనంతరం అతని గొంతు కోసి చంపేశారు.ఇలాంటి ఘటనలో తరచూ జరుగుతుండంతో బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలు దిన దిన గండంగా మారాయని వాపోతున్కనారు. ఇదిలా ఉండగా విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తరువాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గడచిన 18 రోజుల్లో ఆరుగురు హిందువులు హత్యకు గురికావడం గమనార్హం.
……………………………………………………..
