MAA INTI BANGARAM OTT
* 100 కోట్ల క్లబ్లో చేరిన సమంత సినిమా
* జూలై 17 నుంచి ఓటీటీలో సందడి
ఆకేరు న్యూస్, డెస్క్:
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
జూన్ 19న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన తెలుగు చిత్రాల్లో అరుదైన రికార్డు సృష్టించింది.
* జూలై 17 నుంచి జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్
ఈ యాక్షన్ డ్రామా జూలై 17 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే డిజిటల్ వేదికపైకి వస్తుండటం విశేషం. తెలుగు వెర్షన్తో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
* కథ ఏంటంటే..?
ఈ చిత్రంలో సమంత ‘స్వర్ణ’ పాత్రలో నటించారు. తన గతాన్ని దాచిపెట్టి ఓ డాక్టర్ను వివాహం చేసుకున్న యువతి.. అనుకోని పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే సినిమా ప్రధాన కథాంశం. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
* భారీ తారాగణం
బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి కీలక పాత్రల్లో నటించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
థియేటర్లలో 100 కోట్ల క్లబ్లో చోటు దక్కించుకున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాను మిస్ అయిన వారు జూలై 17 నుంచి JioHotstarలో వీక్షించవచ్చు.
July 17th
Okokkodni kodathamu chudu… Prematho abbaaa ❤️🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads… pic.twitter.com/0pgDLow1n4— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026
Please tell us what is wrong. Your report will be sent to the website team.
