Telangana Employee Health Scheme
* రేపటి నుంచి తెలంగాణలో కొత్త హెల్త్ స్కీమ్ అమలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం జులై 15 నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఈ నగదు రహిత వైద్య పథకం కింద క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు.
ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నగదు చెల్లించకుండా వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల సౌకర్యార్థం EHCT మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకరి జీతం నుంచే చందా మినహాయిస్తారు.
అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆరోగ్య సేవలను మరింత విస్తరించనున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
