-పుష్ప 2 ను వెనక్కు నెట్టి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ ఫిల్మ్ గా రికార్డ్
– భారతీయ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మైలురాయి. – యశ్‌రాజ్ సంస్థ
ఆకేరు న్యూస్, కమలాపూర్ : సినిమా పరిశ్రమలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ధురంధర్ మూవీ నిలిచింది. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి థియేటర్లలో ఐదు వారాలు పూర్తి చేసుకొని ఇప్పటికీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అదిత్య ధర్ దర్శకత్వంలో స్టార్ కాస్ట్‌తో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మొదటి భాగం హిందీ వెర్షన్లో మాత్రమే రిలీజ్ అయినప్పటికీ, నేటికీ దేశంలోనే ₹831.40 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ ఫిల్మ్‌గా నిలిచింది. ఇది పుష్ప 2 హిందీ వెర్షన్ రికార్డును కూడా అధిగమించింది. అంతేకాకుండా ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, జవాన్, పఠాన్, పుష్ప 2 వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది.
పాన్ ఇండియా సినిమాగా దురంధర్ 2
ధురంధర్ మొదటి భాగం హిందీలో మాత్రమే రిలీజ్ అయినా, సీక్వెల్ ధురంధర్ పార్ట్ 2 మార్చి 19, 2026న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్లలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రం బాక్సాఫీస్ విండో ముగిసిన తర్వాత జనవరి 30, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. దురందర్ సినిమా భారతీయ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మైలురాయి అని దర్శకుడు ఆదిత్య ధార్ , జియో స్టూడియోలకు యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అభినందనలు తెలిపింది.

…………………………………………
